కేసీఆర్ కూతురు బెడ్ రూంలోకి వెళితే ఊరుకుంటారా !?


తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంటు రేవంత్ రెడ్డి అరెస్టుపై ఆ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ పై మూకుమ్మడి దాడికి దిగారు. కాంగ్రెస్ సీనియర్ నేత జైపాల్ రెడ్డి ఓ అడుగు ముందుకేసి.. ఈ ఏపీసోడ్ లోకి కేసీఆర్ కూతురు, ఎంపీ కవితని లాగారు. రేపు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత మీ కూతురు కవిత ఇంట్లోని బెడ్రూంలోకి నోటీసులు కూడా ఇవ్వకుండా వెళితే మీరు ఊరుకుంటారా ? అని ప్రశ్నించారు. ఒక్కసారి సీఎం అయితేనే కేసీఆర్ ఆగడం లేదు. ఆయనకి అంత దమ్ముందా ? అంటూ ప్రశ్నించారు. ఓటమి భయంతోనే కేసీఆర్ ఇలాంటి చర్యలకు దిగుతున్నారన్నారు.

కొడంగల్ లో ముఖ్యమంత్రి కార్యక్రమం ఉండటం వల్ల బంద్ కు పిలుపునిచ్చిన రేవంత్ ను అరెస్ట్ చేశామని పోలీసులు చెబుతుండటం హాస్యాస్పదంగా ఉంది. తాము బంద్ కు పిలుపునివ్వలేదు. బంద్’కు ఇచ్చిన పిలుపును విరమించుకున్నాం. కేవలం నిరసన కార్యక్రమాలను మాత్రమే చేపడతామని చెప్పాం. రేవంత్’ను హౌస్ అరెస్ట్ చేసి ఉండాల్సింది. లేదంటే వారెంట్ చూపించి, తమతో రావాలని పిలవాలి. ఒక దొంగను తీసుకొచ్చినట్టు రేవంత్ ని తీసుకొచ్చారని జైపాల్ రెడ్డి మండిపడ్డారు.