#RRRలో ఎన్టీఆర్ లుక్ ఇదే.. !

దర్శకధీరుడు రాజమౌళి మల్టీస్టారర్ ‘ఆర్ఆర్ఆర్’ రెగ్యూలర్ షూటింగ్ మొదలైపోయింది. తొలి షెడ్యూల్‌లో ఎన్టీఆర్‌, చరణ్‌ లు ఇద్దరు పాల్గొన్నారు. వీరిపై ఓ భారీ యాక్షన్‌ సీన్స్‌ చిత్రీకరించారు. సినిమాలో తారక్ డిఫరెంట్ లుక్ లో కనిపించబోతున్నారు. చరణ్ లుక్ కూడా విభిన్నంగా ఉండనుందని ప్రచారం జరిగింది. ఐతే, తాజాగా, సెట్స్ నుంచి తారక్ ఫోటోలు లీకయ్యాయి.

ఇందులో తారక్ బొద్దుగా కనిపిస్తున్నాడు. పాత ఎన్టీఆర్ ని తలపిస్తున్నాడు. ‘యమదొంగ’కి ముందు ఎన్టీఆర్ గుర్తుకి తెస్తున్నాడు. బొద్దుగా గెడ్డం లుక్ లో ఉన్నారు. సినిమాలో ఎన్టీఆర్ లుక్ ఇదేననే ప్రచారం జరుగుతోంది. ఆర్ఆర్ఆర్ కోసం తారక్ వంద కేజీలకిపైగా బరువు పెరిగారట. దీంతో ‘రాఖీ’ సినిమాలో ఎన్టీఆర్ గా కనిపిస్తున్నాడు. ఇక, మిగిలింది చరణ్ మాత్రమే. ఆయన లుక్ ఎలా ఉండబోతుంది అనేది చూడాలి.

భారీ బడ్జెట్ తో ‘ఆర్ఆర్ఆర్’ తెరకెక్కుతోంది. బాహుబలి రేంజ్ లో ఆర్ ఆర్ ఆర్ ని తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో విడుదల చేయబోతున్నారు. తారక్, చరణ్ లకి జంటగా నటించబోయే హీరోయిన్స్ ఎవరు ? అనేది ఇంకా తెలియాల్సి ఉంది. దాని కోసం జక్కన్న ఓ మేజికల్ డేటు(12-12-12) ని ఫిక్స్ చేశాడని చెబుతున్నారు. ఈ నెల 12న రాజమౌళి హీరోయిన్స్ ఎవరన్నది తేలనుంది.