నటనకి కమల్ గుడ్ బై !

యూనివర్సల్ హీరో కమల్ హాసన్ నటనకి గుడ్ బై చెప్పే సమయం దగ్గరపడింది. ‘ఇండియన్ 2’ (భారతీయుడు 2 – తెలుగులో) ఆయన ఆఖరి చిత్రం కానుందని చెబుతున్నారు. ఇప్పటికే కమల్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు. ‘మక్కల్‌ నీది మయ్యం’ పార్టీని స్థాపించారు. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బరిలోకి దిగేందుకు ప్లాన్ చేసుకొంతున్నారు. ఇందులో భాగంగా రోడ్ షోలు, ర్యాలీలు నిర్వహిస్తున్నారు. మరోవైపు, వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అవుతున్నారు. ఆయా రాష్ట్రాల సంక్షేమ కార్యక్రమాలపై అధ్యయనం చేస్తున్నారు. ఇదంతా ‘మక్కల్‌ నీది మయ్యం’ మెనిఫెస్టో రెడీ చేసుకోవడంలో ఉపయోగపడనుందని భావిస్తున్నారు.

ఇక, సినిమాల విషయానికొస్తే కమల్ ‘శభాష్‌ నాయుడు’ సినిమా మధ్యలోనే ఆగిపోయింది. ‘భారతీయుడు-2’తో చివరిసారిగా తెరమీద అభిమానుల్ని తన నటనతో మైమరపించి పూర్తిగా రాజకీయ జీవితంలో మునిగేందుకు సిద్ధం అయ్యారని తెలుస్తోంది. ఐతే, ఓ సందర్భంలో.. తన చివరి శ్వాస ఉన్నంతవరకు నటిస్తానని ప్రకటించారు. మరీ.. మాటకు కట్టుబడి రాజకీయాలతో బిజీ అయినా.. చిన్ని చిన్ని పాత్రలతో అభిమానులని అలరిస్తాడేమో చూడాలి. ఇక, భారతీయుడు 2 ని త్వరలోనే సెట్స్ మీదకు తీసుకెళ్లేందుకు కమల్ రెడీ అవుతున్నారు. ఇప్పటికే సినిమాలో కమల్ లుక్ సెట్టయిందని శంకర్ తెలిపారు. కమల్ కి జంటగా కాజల్ నటించనుంది