కాబోయే సీఎం రేవంత్ రెడ్డి.. !
తెలంగాణ ఎన్నికల ప్రచారానికి పులిస్టాప్ పడింది. ఓటర్ల తీర్పు మాత్రమే మిగిలివుంది. ఈ శుక్రవారం (డిసెంబర్ 7) ఓటింగ్. వచ్చే మంగళవారం (డిసెంబర్ 11) ఎన్నికల ఫలితాలు వెలవడనున్నాయి. టీఆర్ఎస్ అధికారంలోకి వస్తే మరోసారి కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతారు ? అలాకాకుండా కాంగ్రెస్ సారధ్యంలోని ప్రజాకూటమి అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అవుతారు ? ఈ విషయంపైనే టీఆర్ఎస్ ఎన్నికల ప్రచారలో కాంగ్రెస్ ని టార్గెట్ చేస్తూ వచ్చింది. ఐతే, తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అభ్యర్థుల లిస్టులో డజనుకు పైగా నేతలున్నా.. ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంటు రేవంత్ రెడ్ది ముందు వరుసలో ఉన్నట్టు కనబడుతోంది.
ఈ మేరకు కాంగ్రెస్ అధిష్టానం నుంచి లీకులొస్తున్నాయ్. మంగళవారం రేవంత్ రెడ్ది అంశం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఈ ఆంశంపై కాంగ్రెస్ అధిష్టానం స్పందించింది. రేవంత్ అరెస్ట్ పై ఆ పార్టీ జాతీయాధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్ చేశారు. ఇక, ఇవాళ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ రేవంత్ ని పరామర్శించడానికి కొడంగల్ కి విచ్చేశారు. ఎన్నికల ప్రచారంలో ఉన్న రేవంత్ కోసం ఏకంగా గంటపాటు ఎదురు చూసి.. వచ్చాక ఆయన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆజాద్.. ఈరోజు సీఎం సీటులో కేసీఆర్ ఉండొచ్చని, రేపు అదే సీటులో రేవంత్ రెడ్డి కూడా ఉండొచ్చని అన్నారు. ఈ ఒక్క మాటతో కాంగ్రెస్ అధిష్టానం మనసులో తెలంగాణ కాంగ్రెస్ సీఎం అభ్యర్థిగా రేవంత్ రెడ్డి ఉన్నారనే విషయం అర్థమైందని చెప్పుకొంటున్నారు