తమన్నా ఎఫైర్ బయటపడింది !

మిల్కీ బ్యూటీ తమన్నాది క్లీన్ ఇమేజ్. ఇప్పటి వరకు ఆమెని ఎవరితోనూ లింకు పెడుతూ పెద్దగా వార్తలు రాలేదు. ఐతే, తొలిసారి తమ్మూ ఎఫైర్స్ బయటపడ్డాయి. ఓ యంగ్ హీరోతో ఆమె డేటింగ్ చేసింది. ఆయన్ని పెళ్లి చేసుకోవాలని అనుకొంది. అతడితో సెక్స్ విషయంలో అభిప్రాయ బేధాలు రావడంతో బ్రేకప్ చెప్పిందట. ఆ తర్వాత భార్యతో విడాకులు పొందిన ఓ పారిశ్రామిక వేత్తతో రిలేషన్ పెట్టుకొంది. చివరికి అతడికి బ్రేకప్ చెప్పేసింది. ఇన్నాళ్లు క్లీన్ ఇమేజ్ తెచ్చుకొన్న తమ్మూ ఎఫైర్స్ బయటపడం ప్రేక్షకులని షాక్ గురిచేస్తోంది. ఐతే, ఇదంతా తమ్మూ రియల్ లైఫ్ లో కాదు. రీల్ లైఫ్ లో. ‘నెక్ట్స్ ఏంటీ’లో తమ్మూ ఎఫైర్స్ కథ.

తమ్మూ-సందీప్ కిషన్ జంటగా నటించిన చిత్రం ‘నెక్ట్స్ ఏంటీ’. బాలీవుడ్ దర్శకుడు కునాల్ కోహ్లీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రమిది. సహజీవనం, పెళ్లికి ముందు రిలేషన్స్ లాంటి బోల్డ్ కంటెంట్‌తో తెరకెక్కింది. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. టీజర్, ట్రైలర్ లోనే వినిపించిన బోల్డ్ మాటలు యూత్ ని థియేటర్స్ కి వచ్చేలా చేశాయి. ఐతే, ఆ మాటల రేంజ్ చేతలు సినిమాలో లేవని సినిమా చూసిన ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు. ఈ రొమాంటిక్ ఎంటర్ టైనర్ లో రొమాన్స్ మిస్సవ్వడం పెద్ద మైనస్ గా మారింది. ఫస్టాఫ్’లో ఎలాంటి కథ లేకుండానే.. లెంగ్తీ సీన్లతో విసుగుపుడుతుంది.

సెకాంఢాఫ్ లో లవ్ స్టోరీని ప్రారంభమవుతోంది. ఐతే, అందులోనూ యూత్‌కు గిలిగింతలు పెట్టే అంశాలు ఎక్కడా కనిపించవు. తమ్మూ-సందీప్ కిషన్ ల మధ్య సీన్స్ పేలవంగా సాగాయి. తమ్మూని సందీప్ తృప్తిపరచలేకపోయాడు. ఆమెతో సమానంగా రొమాన్స్ చేయలేకపోయాడు. తమ్మూ గ్లామర్ గా కనిపించింది. చిట్టి, పొట్టి డ్రెస్సులు, ఎక్స్ ప్రెషన్స్ తో చంపేసింది. సందీప్ మాత్రం తేలిపోయాడు. ఆయనకి సూటుకాని సినిమా అని ఫీలయ్యేలా చేశాడు. మొత్తంగా.. సినిమాలో తమ్మూ ఎఫైర్స్ మేటరు ఒక్కటే హైలైట్. మిగితాకథలో మేటరు ఏమీ లేదనిపించింది. ఫైనల్ గా సందీప్-తమ్మూ యూత్ ని నిరాశపరిచారని చెప్పవచ్చు.