మళ్లీ అధికారం ‘టీఆర్ఎస్’దే.. కానీ !

తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు ముగిశాయి. ఫలితాల కోసం ఈ నెల 11వ వరకు వెయిట్ చేయాల్సిందే. ఐతే, పోలింగ్ ముగియగానే సర్వేలు క్యూ కట్టాయి. సర్వేలన్నీ తెలంగాణలో టీఆర్ఎస్ నే మళ్లీ అధికారంలోకి రాబోతుందని చెబుతున్నాయి. ఒక్క లగడపాటి రాజగోపాల్‌ సర్వే మినహా. లగడపాటి మాత్రం విజయం ప్రజా కూటమి వైపు మొగ్గుచూపుతుందని తెలిపారు. ఏకంగా ప్రజాకూటమి 65స్థానాల్లో విజయం సాధించే అవకాశం ఉందని తెలిపారు. తెరాస 25-45 మధ్య సీట్లని గెలుచుకోవచ్చని తెలిపారు.

తెరాస 79-91 మధ్య సీట్లతో ఘన విజయం సాధించవచ్చని ఇండియాటుడే అంచనా వేసింది. ఆ పార్టీకి 66 స్థానాలు రావచ్చని టైమ్స్‌ నౌ-సీఎన్‌ఎక్స్‌ చెబితే, 50-65 మధ్య వస్తాయని రిపబ్లిక్‌ టీవీ పేర్కొంది. మొత్తంగా జాతీయ టీవీ ఛానెల్స్, సర్వే సంస్థలన్నీ టీఆర్ ఎస్ కే పట్టకట్టాయి. లోకల్ సర్వేలు కూడా టీఆర్ ఎస్ కే విజయావకాశాలు అధికంగా ఉన్నాయని చెబుతున్నాయి. ఒక్క లగడపాటి సర్వే మాత్రం రివర్స్ లో ఉంది. మరీ.. సర్వేలు ఎంత వరకు నిజంకానున్నాయి అన్నది ఈ నెల 11వ తేదిన తేలిపోనుంది.