ప్రభాస్-అనుష్కల ప్రేమ.. రాజమౌళియే సాక్ష్యం !
స్వీటి అనుష్కతో ప్రభాస్ పీకల్లోతు ప్రేమలో ఉన్నారు. ‘బాహుబలి’ షూటింగ్ సమయంలోనే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. రెండేళ్ల ‘బాహుబలి’ సినిమా ప్రయాణంలో ఒకరినొకరు బాగా అర్థం చేసుకొన్నారు. త్వరలో స్వీటిని పెళ్లాడబోతున్నాడని చాన్నాళ్లుగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని స్వీటీ, ప్రభాస్.. ఇద్దరూ ఖండించారు. తాము ప్రేమికులం కాదు. మంచి స్నేహితులం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు. అయినా.. ప్రభాస్-అనుష్క ప్రేమ పుకార్లకి పులిస్టాప్ పడటం లేదు.
ప్రముఖ బాలీవుడ్ దర్శక-నిర్మాత కరణ్ జోహార్ నిర్వహిస్తోన్న ‘కాఫీ విత్ కరణ్’ షోలోనూ ప్రభాస్-అనుష్క ప్రేమ వ్యవహారం హైలైట్ అయ్యింది. రానా, రాజమౌళితో కలిసి ప్రభాస్ ఈ షోలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా.. స్వీటీ అనుష్కతో డేటింగ్ పై ప్రభాస్ ని ప్రశ్నించాడు కరణ్. ఏ ఇద్దరు హీరో హీరోయిన్లైనా రెండేళ్లు కలిసి పనిచేస్తే సహజంగానే వాళ్లిద్దరికీ లింక్ పెట్టేసి ప్రచారం చేస్తుంటారు. నిజం చెప్పాలంటే నాకు, అనుష్కకి మధ్య అలాంటిదేం లేదు. మేమిద్దరం డేటింగ్ చేస్తున్నట్టుగా వస్తోన్న వార్తల్లో ఎంతమాత్రం నిజం లేదన్నారు. కావాలంటే రాజమౌళిని అడగండి అన్నారు ప్రభాస్. సో.. ప్రభాస్-అనుష్క ప్రేమకు జక్కన్నే సాక్ష్యం అన్నమాట.
ఇక, బాహుబలి తర్వాత ప్రభాస్ ‘సాహో’ సినిమా చేస్తున్నారు. సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న చిత్రమిది. ఇందులో ప్రభాస్ కి జంటగా బాలీవుడ్ హీరోయిన్ శ్రద్దాకపూర్ నటిస్తోంది. ఈ యాక్షన్ థ్రిల్లర్ ని బాలీవుడ్ రేంజ్ లో తెలుగు, తమిళ్, హిందీ బాషల్లో విడుదల చేయనున్నారు. సాహో సినిమాతో పాటు రాథాకృష్ణ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు ప్రభాస్. ఇక, రాజమౌళి ఆర్ఆర్ఆర్ మల్టీస్టారర్ ని ఇటీవలే సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ఇందులో తారక్, చరణ్ లు కథానాయకులుగా నటిస్తున్నారు. రానా ప్రస్తుతం ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్నారు. ఇందులో ఆయన ఏపీ సీఎం చంద్రబాబు పాత్రలో కనిపించబోతున్నారు.