ఇక్కడ ‘వినయ విధేయ రామ’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ పాసెస్ లభించును !

రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ షూటింగ్ రేపటితో పూర్తికానుంది. ఎల్లుండే (డిసెంబర్ 27) ప్రీ-రిలీజ్ ఫంక్షన్ జరపబోతున్నారు. ఈ విషయాన్ని చెబుతూ చిత్రబృందం ఓ పోస్టర్ ని వదిలిన సంగతి తెలిసిందే. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ ఫంక్షన్ జరగనుంది. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరుకాబోతున్నారు.

ఈ నేపథ్యంలో ‘వినయ విధేయ రామ’ ప్రీ-రిలీజ్ వేడుక పాసెస్ కోసం మెగా అభిమానుల అన్వేషణ మొదలైంది. ఐతే, అభిమానులకి పెద్దగా ఇబ్బంది లేకుండా.. ఈ ఫంక్షన్ పాసెస్ హైదరాబాద్ లోని చిరంజీవి చారిటబుల్ ట్రస్టు (CCT) వద్ద లభిస్తాయని ట్విట్ చేశారు రామ్ చరణ్. దీంతో మెగా అభిమానులంతా (CCT) దగ్గరకి పరుగులు తీయడం మొదలెట్టేశారు.

ఇక, క్లాస్ టైటిల్ తో రామ్ చరణ్ లోని అసలైన మాస్ ని చూపించబోతున్నాడు దర్శకుడు. చరణ్ సరసన బాలీవుడ్ హీరోయిన్ కైరా అద్వానీ నటించింది. వివేక్ ఒబెరాయ్, ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహ.. తదితరులు కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. డి.వి.వి దానయ్య నిర్మించారు.