‘వివిఆర్’ ట్రైలర్ కోసం రాత్రి ముహూర్తం

రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ రేపు (డిసెంబర్ 27) జరగనున్న సంగతి తెలిసిందే. హైదరాబాద్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ జరగబోయే ఈ వేడుకకి టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంటు కేటీఆర్ ముఖ్య అతిథిగా హారజరుకాబోతున్నారు. ప్రీ-రిలీజ్ వేడుక వేదికగా సినిమా ట్రైలర్ ని కూడా రిలీజ్ చేయబోతున్నారు. ట్రైలర్ కోసం ప్రత్యేకంగా ముహూర్తాన్ని ఫిక్స్ చేశారు. రేపు రాత్రి సరిగ్గా 9గంటలకి ట్రైలర్ ని వదలబోతున్నారు. ట్రైలర్ రిలీజ్ ముహూర్తాన్ని తెలియజేస్తూ ఓ పోస్టర్ తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు రామ్ చరణ్. ఈ పోస్టర్ లో గుర్రంపై చరణ్ లుక్ అదిరిపోయింది. ఇప్పుడీ పిక్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

‘రంగస్థలం’లాంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత రామ్ చరణ్ నుంచి వస్తున్న ఈ చిత్రంపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలున్నాయి. బోయపాటి సినిమా కోసం మాస్ ప్రేక్షకులు ఎప్పుడూ ఆతృతగా ఎదురు చూస్తుంటారు. ‘వినయ విధేయ రామ’ టైటిల్ క్లాస్ గా ఉన్నా.. బోయపాటి మార్క్ హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఉండనుందని తెలుస్తోంది. ఇందులో చరణ్ సరసన కైరా అద్వానీ జతకట్టనుంది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో నటించారు. ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహ.. తదితరులు కీలక పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. డివివి దానయ్య నిర్మాత. సంక్రాంత్రికి సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.