ట్రిపుల్‌ తలాక్‌ బిల్లుకు లోక్‌సభ ఆమోదం

వెంట వెంటనే మూడు సార్లు తలాక్‌ అంటూ ముస్లిం మహిళలకు విడాకులు ఇవ్వడాన్ని నేరంగా పరిగణిస్తూ కేంద్రం కొత్త చట్టం తీసుకొచ్చింది. లోక్ సభలో ప్రవేశపెట్టిన ట్రిపుల్ తలాక్ బిల్లుకు ఆమోదం లభించింది. ఈ బిల్లుపై నిర్వహించిన ఓటింగ్‌లో అనుకూలంగా 245 మంది, వ్యతిరేకంగా 11 మంది సభ్యులు ఓటు వేశారు.

ట్రిపుల్‌ తలాక్‌ బిల్లును జాయింట్‌ సెలెక్ట్‌ కమిటీకి పంపించనందుకు నిరసనగా కాంగ్రెస్‌, అన్నాడీఎంకే సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు. ఈ బిల్లుపై ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ ప్రతిపాదించిన ప్రతిపాదనలు కూడా ఆమోదం పొందలేదు. మూడు సార్లు తలాక్‌ చెప్పే భర్తలకు ప్రస్తుత చట్టం ప్రకారం మూడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది.