త్రివిక్రమ్’తో మెగాస్టార్ సినిమా ఫిక్స్

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు ప్రకటించారు మెగాస్టార్ చిరంజీవి. ఆదివారం హైదరాబాద్ లో రామ్ చరణ్ ‘వినయ విధేయ రామ’ ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకకి మెగాస్టార్ చిరంజీవితో పాటు తెరాస వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మెగాస్టార్ ఉత్సాహంగా మాట్లాడారు. వివిఆర్ బ్లాక్ బస్టర్ హిట్ కావాలని ఆకాక్షించాలి. చివర్లో అభిమానులకి అదిరిపోయే న్యూస్ చెప్పారు.

‘త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నా. ఇప్పటికే ఫిక్సయ్యింది. ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మించనున్నారని తెలిపారు’ మెగాస్టార్. అసలు ఈ విషయం ఇప్పుడు చెప్పాల్సింది కాదు. కానీ ఆపుకోలేకపోతున్నా. అందుకే చెప్పా.. అంటూ వెనకనున్న త్రివిక్రమ్ ని చూసి నవ్వేశారు. త్రివిక్రమ్ కూడా ఫర్వాలేదు సార్.. అంటూ ఆలింగనం చేసుకొన్నారు.

వాస్తవానికి త్రివిక్రమ్ దర్శకత్వంలో చిరు, పవన్ ల మల్టీస్టారర్ రాబోతున్నట్టు ప్రచారం జరిగింది. దీని ప్రముఖ పారిశ్రామికవేత్త, నిర్మాత టి సుబ్బిరామిరెడ్డి ప్రకటన కూడా చేశారు. ఆ తర్వాత ఈ మల్టీస్టారర్ కు సంబంధించిన అప్ డేటు రాలేదు. ఇప్పుడు సడెన్ గా త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేయబోతున్నట్టు మెగాస్టార్ ప్రకటించేశారు. మరీ.. ఇందులో పవన్ కూడా కనిపిస్తాడా.. ? అన్నది చూడాలి. అన్నట్టు త్రివిక్రమ్ సినిమా ప్రకటన చేసిన చిరు అది ఎప్పుడు ఉంటుందన్నది మాత్రం చెప్పలేదు.