ప్రధాని ఏపీ పర్యటన వాయిదా ?
ప్రధాని నరేంద్ర మోడీ ఏపీ పర్యటన వాయిదాపడేలా కనబడుతోంది. షెడ్యూల్ ప్రకారం జనవరి 6న మోడీ ఏపీకి రావాల్సి ఉంది. ఆరోజు ప్రధాని కేరళలో పర్యటించిన తర్వాత ఏపీకి రావాల్సి ఉంది. ఐతే, కేరళలో ప్రధాని పాల్గొనబోయే తిరువనంతపురం సభని శబరిమల సమీపంలోని ‘పట్టణంతిట్టా’కు మార్చాలని ఆ రాష్ట్ర బీజేపీ శ్రేణులు అధిష్ఠానంపై ఒత్తిడి తెస్తున్నాయి. ఇదే జరిగితే మోడీ ఏపీ పర్యటన వాయిదా పడనుంది. దీనిపై ఈరోజు సాయంత్రానికల్లా క్లారిటీ రానుందని చెబుతున్నారు.
మరోవైపు, ప్రధాని ఏపీ పర్యటనని ముఖ్యమంత్రి చంద్రబాబు వ్యతిరేకిస్తున్నారు. ప్రధాని పర్యటనని అడ్డుకోవాలని ప్రజలకి పిలుపినిచ్చారు. నాలుగున్నరేళ్లుగా రాష్ట్రానికి ఏమీ చేయని మోదీ ఏం మొహం పెట్టుకుని ఇక్కడికి వస్తున్నారని నిలదీస్తున్నారు. ఎన్డీయే నుంచి టీడీపీ వైదొగిలిన తర్వాత తొలిసారి ప్రధానికి ఏపీకి వస్తున్నారు. ఈ పర్యటనలో ఏపీకి కేంద్రం ఏం చేసింది అనే విషయాన్ని ప్రధాని చెప్పబోతున్నారు. ఇన్నాళ్లు కేంద్రంపై చంద్రబాబు చేసిన విమర్శలకు మోడీ సమాధానం ఇవ్వబోతున్నాడనే ప్రచారం నేపథ్యంలో.. ప్రధాని ఏపీ పర్యటన ఆసక్తిగా మారింది.