సంక్రాంత్రి తర్వాతే కేబినెట్ విస్తరణ

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన కేబినెట్ విస్తరణ విషయంలో ఏమాత్రం తొందరపడటం లేదు. సంక్రాంత్రి తర్వాతే కేబినేట్ విస్తరణ చేయబోతున్నట్టు సమాచారమ్. ఈ లోపు శాఖలపై ప్రక్షాళన చేయనున్నట్టు తెలుస్తోంది. సారుప్యత గల శాఖలని కలిపి ఒకే శాఖ క్రిందికి తీసుకొచ్చే ఆలోచనలో సీఎం కేసీఆర్ ఉన్నట్టు తెలుస్తోంది. ఉదాహరణకి వ్యవసాయ శాఖ, మార్కెటింగ్ శాఖలు వేర్వేరుగా ఉన్నాయి. వీటిని కలిపేసి ఒకే శాఖగా చేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదని భావిస్తున్నారు.

గాయాలు, ముహూర్తాలని బలంగా నమ్మే కేసీఆర్.. సంక్రాంత్రి మూడ దినాలలో కేబినేట్ విస్తరణ చేయకపోవచ్చని చెబుతున్నారు. జనవరి 21-25 తేదీల మధ్య కేసీఆర్‌ మరోసారి యాగం నిర్వహించనున్నారు. ఈలోపు అంటే జనవరి 16 నుంచి 20లోపు మంత్రివర్గ విస్తరణ ఉండొచ్చని సమాచారమ్. ఇక, కేసీఆర్ కేబినెట్ లో 18మందికి (సీఎం కేసీఆర్ తో కలిపి) అవకాశం ఉంది. ఇప్పటికే సీఎం కేసీఆర్, ఉప ముఖ్యమంత్రి మహమ్మద్ అలీ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ నేపథ్యంలో మరో 12 మందికి తన కేబినేట్ లో కేసీఆర్ అవకాశం కల్పించే అవకాశాలున్నాట్టు తెలుస్తోంది.