కార్తికేయ పెళ్లివేడుకలో ‘సూపర్ స్టయిల్’ మిస్ అయ్యారు !
రాజమౌళి కుమారుడు కార్తికేయ వివాహ వేడుక జయపురలో జరుగుతున్న సంగతి తెలిసిందే. నటుడు జగపతిబాబు సోదరుడు రాంప్రసాద్ కుమార్తె పూజా ప్రసాద్‌తో ఆయన వివాహం జరుగుతోంది. ఈ నేపథ్యంలో శుక్రవారమే సినీ ప్రముఖులు జయపుర చేరుకున్నారు. అక్కినేని నాగార్జున, రామ్‌చరణ్, ఎన్టీఆర్, ప్రణతి, అభయ్‌రామ్, ప్రభాస్, రానా, నాని, జగపతిబాబు, అనుష్క, సుస్మితా సేన్ తదితరులు పెళ్లి వేడుకకు హాజరయ్యారు.
కార్తికేయ పెళ్లికి హాజరైన స్టార్స్‌కు రాజమౌళి ఘన స్వాగతం చెప్పారు. విమానాశ్రయం నుంచి వచ్చిన సినీ ప్రముఖులతో కలిసి రాజమౌళి స్టెప్పులేశారు. జయపురలో రాజమౌళి, రామ్‌చరణ్ కలిసి డ్యాన్స్ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఐతే, సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ లు ఈ పెళ్లి వేడుకని మిస్సయ్యారు. వీరిలో బన్నీకి ఆహ్వానం అందినా.. రాలేదు. ఇక రాజమౌళి ఫ్యామిలీ నుంచి మహేష్ కి ఆహ్వానం అందలేదని తెలుస్తోంది.