‘bangaram saysSS’ అంటే ఏంటో.. ?
గత నాలుగైదు రోజులుగా రాజమౌళి కుమారుడి కార్తికేయ పెళ్లి సందడి కబర్లు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. పెళ్లి వేడుకలో టాలీవుడ్ స్టార్స్ ప్రభాస్, అనుష్క, తారక్, చరణ్, రానా.. తదితరులు చేసిన వీడియో బిట్స్ వైరల్ గా మారాయి. వీటితో పాటు ‘bangaram saysSS’ అనే హ్యాష్‌ట్యాగ్ వైరల్ అవుతోంది.
ఈ హ్యాష్‌ట్యాగ్ వెనక ఉన్న అర్థం ఏంటేంటే.. ? కార్తికేయ.. తన భార్య పూజను బంగారం అని పిలుస్తారట. పూజ.. కార్తికేయను ‘ss’ అని ఇంటి పేరుతో సంబోధిస్తారట. అందుకే శుభలేఖలోనూ ‘bangaram saysSS’ అనే హ్యాష్‌ట్యాగ్‌ను కూడా అచ్చువేయించినట్లు తెలుస్తోంది. ఇక, ఆదివారం రాత్రి రాజస్థాన్ రాజధాని జయపురలోని ఓ స్టార్ హోటల్ లో కార్తికేయ-పూజా ప్రసాద్ లో పెళ్లితో ఒక్కటయ్యారు. బంగారం మెడలో ఎస్ ఎస్ తాళీ కట్టి తన దానిని చేసుకొన్నారు.