విశాల్ పెళ్లి ఫిక్స్.. అమ్మాయి ఎవరో తెలుసా ?
హీరో విశాల్ త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నారట. ఈ విషయాన్ని ఆయన తండ్రి, ప్రముఖ నిర్మాత జీకే రెడ్డి కోలీవుడ్ మీడియా వర్గాలతో చెప్పినట్లు తెలుస్తోంది. ఇంతకీ విశాల్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి ఎవరో తెలుసా ? హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త కుమార్తె అనీశాతో విశాల్ వివాహం జరగబోతుంది. త్వరలో హైదరాబాద్‌లో నిశ్చితార్థ వేడుకను నిర్వహించనున్నారట.
నడిగర్ సంఘం కోసం కొత్త భవనాన్ని నిర్మించిన తర్వాతే పెళ్లి చేసుకుంటానని విశాల్ శపథం చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రస్తుతానికి నిశ్చితార్థం చేసుకోనున్నారు. నడిగర్ సంఘం కొత్త భవన నిర్మాణం పూర్తికావడమే ఆలస్యం.. విశాల్ పెళ్లి జరగనుంది.
ఇక, విశాల్ ప్రేమ వివాహం చేసుకోబోతున్నట్టు చాన్నాళ్లుగా ప్రచారం జరిగింది. ఆయన హీరోయిన్ వరలక్ష్మి శరత్‌కుమార్ తో ప్రేమలో ఉన్నారు. వీరిద్దరు త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నట్టు జోరుగా ప్రచారం జరిగింది. ఐతే, ఈ ప్రచారాన్ని విశాల్, వరలక్ష్మీ ఇద్దరూ ఖండించారు. తాము మంచి స్నేహితులం మాత్రమేనని క్లారిటీ ఇచ్చారు.