‘మహర్షి’ న్యూఇయర్ గిఫ్ట్.. సూపర్భ్ !


సూపర్ స్టార్ మహేష్ బాబు నుంచి అభిమానులకి న్యూఇయర్ గిఫ్ట్ వచ్చేసింది. మహేష్ 25వ చిత్రం ‘మహర్షి’. వంశీపైడి పల్లి దర్శకత్వంలో తెరకెక్కుతోంది. న్యూఇయర్ కానుకగా ‘మహర్షి’ కొత్త పోస్టర్ ని విడుదల చేసింది చిత్రబృందం. ఇందులో మహేష్
సూటు, బూటు, కూలింగ్ గ్లాస్‌ తో బిజినెస్ మేన్ లుక్ లో కనిపిస్తున్నారు. అభిమానులకి న్యూఇయర్ శుభాకాంక్షలు తెలియజేస్తూ.. కొత్త పోస్టర్ ని షేర్ చేశారు మహేష్.

‘మహర్షి’లో మహేష్ మూడు విభిన్న షేడ్స్ ఉన్న గెటప్స్ లో కనిపించబోతున్నాడు. ఫస్ట్ లుక్ టీజర్ లో మహేష్ కాలేజీ స్టూడెంట్ గా రొమాంటిక్ గా కనిపించి ఆకట్టుకొన్నారు. ఇప్పుడు మహేష్ బిజినెస్ మేన్ లుక్ బయటికొచ్చింది. ఇక, మిగిలింది రైతు పాత్రనేనని చెబుతున్నారు. ఇటీవలే మహేష్ రైతుగా కనిపించే సన్నివేశాలని హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో చిత్రీకరించారు.

ఈ చిత్రంలో మహేష్ కి జంటగా పూజా హెగ్డే నటిస్తోంది. ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం. దిల్ రాజు, అశ్వినీదత్ , పీవీపీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.