పంచాయతీ ఎన్నికల నగారా మోగింది

తెలంగాణలో పంచాయతీ ఎన్నికల నగారా మోగింది. ఎన్నికల ప్రక్రియను వివరిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్‌ఈసీ) మంగళవారం నోటిఫికేషన్‌ను వెలువరించింది. మూడు విడతలుగా జనవరి 21, 25, 30 తేదీల్లో పోలింగ్‌ను నిర్వహించనున్నారు.

ఈనెల 7, 11, 16 తేదీల్లో నామినేషన్ల పర్వం ప్రారంభమవుతుంది. పోలింగ్‌ ముగిసిన రోజునే ఫలితాలను వెల్లడించి, చేతులెత్తే పద్ధతిలో ఉప సర్పంచి ఎన్నికలను సైతం పూర్తి చేస్తారు. రాష్ట్రంలో మొత్తం 12,751 పంచాయతీలు ఉండగా వాటిలో ఇప్పుడు 12,732 పంచాయతీల్లో ఎన్నికలను చేపట్టనున్నారు.