‘వివిఆర్’ కోసం చరణ్ డైట్ చాట్ చూశారా.. ?
వినయ విధేయ రాముడిగా సంక్రాంత్రికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు రామ్ చరణ్. ఇందులో చరణ్ ఫిట్ గా కనిపించబోతున్నాడు. టీజర్, ట్రైలర్ తో ఆ విషయం అర్థమైంది. ‘ధృవ’ సినిమాలో కనిపించదానికంటే ఫిట్ గా ‘వివిఆర్’లో కనిపిస్తున్నారు. ట్రైలర్ లో చరణ్ చొక్కా విప్పేసి కనిపించడంతో.. అంతా చరణ్ ఫిట్ నెస్ పై మాట్లాడుకొంటున్నారు.
ఈ నేపథ్యంలో రామ్ చరణ్ ‘వివిఆర్’ కోసం ఫాలో అయిన డైట్ ఛాట్ ని ఆయన సతీమణి ఉపాసన ట్విట్ చేసింది. హార్డ్ వర్క్, డెడికేషన్, డిసిప్లేన్ గా చరణ్ డైట్ చాట్ ని ఫాలో అవుతారు. మీరు ట్రై చేయండి.. ఫిట్ గా ఉండండని కామెంట్ పెట్టింది. చరణ్ ‘వివిఆర్’ కోసం చరణ్ ఫాలో అయిన డైట్ చాట్ ని మీరు ఓ సారి చూసేయండీ.. !
Hard work, Dedication & Discipline ! #ramcharan #vvr diet ! Try the diet ! Stay fit ! Stay healthy ! @rakeshru pic.twitter.com/Tz8xIFOvr9
— Upasana Konidela (@upasanakonidela) January 2, 2019