సిడ్నీ టెస్టు : టాస్ గెలిచి భారత్ బ్యాటింగ్ 177/2 (52ఓవర్లు)
సిడ్నీ టెస్ట్ లో భారత్ అదరగొడుతోంది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ తొలి వికెట్ త్వరగానే కోల్పోయింది. ఓపెనర్ కెఎల్ రాహుల్ 9 పరుగుకే అవుటయ్యాడు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన పుజారా, మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కలిసి ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ ముందుకు నడిపించారు. ఈ క్రమంలో మయాంక్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకొన్నాడు. 34వ ఓవర్లో లైయన్ వేసిన బంతిని స్టార్క్ చేతికిచ్చి మయాంక్(77) పెవిలియన్ చేరాడు.
ప్రస్తుతం క్రీజులో పుజారా(61), కోహ్లీ(23) ఉన్నారు. 52 ఓవర్లలో టీమిండియా రెండు వికెట్లు చేజార్చుకుని 117 పరుగులు చేసింది. ఇక, ఇప్పటికే నాలుగు టెస్టుల సిరీస్ లో టీమిండియా 2-1 ఆధిక్యంలో ఉంది. ఆఖరి టెస్టులో కూడా గెలిచి సిరీస్ 3-1తో గెలవాలనే లక్ష్యంత్ కోహ్లీని బరిలోకి దిగింది. ప్రస్తుతానికైతే కోహ్లీ సేన పటిష్ట స్థితిలోనే కనబడుతోంది. తొలి ఇన్నింగ్స్ లో ప్రత్యర్థి ముందు భారీ స్కోర్ ఉంచగలిగితే.. గెలుపు సునాయసం కానుంది.