చరణ్ కోసం ‘చేప ఫ్రై’ చేసిన ఉపాసన
‘వినయ విధేయ రామ’ సినిమా కోసం రామ్ చరణ్ ఫాలో అయిన డైట్ లిస్టుని ఆయన సతీమణి ఉపాసన అభిమానులతో పంచుకొన్న సంగతి తెలిసిందే. అంతేకాదు.. సినిమా షూటింగ్ సందర్భంగా డైట్ లిస్టులో ఉన్న చేప ఫ్రైని స్వయంగా చేసి ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో కూడా ఉపాసన అభిమానుల కోసం షేర్ చేసింది.
ఇందులో చరణ్ అసిస్టెంట్ పక్కనున్న కాలువ నుంచి ఓ చేపను పట్టుకొచ్చి శుభ్రం చేస్తున్నాడు. ఆ తర్వాత దాన్ని ఉపాసన స్వయంగా ఫై చేసింది. ఉప్పును వాడకుండా ఆలివ్ ఆయిల్, నిమ్మరసంతో ఆమె ఈ డిష్ ను తయారు చేశారు. ఈ వంటకం తయారీలో ఉపాసనకు చరణ్ కూడా సాయం అందించాడు. ఇద్దరు కలిసి సరదా చేసిన చేప ఫ్రై వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా అయింది.
ఇక, రామ్ చరణ్ వినయ విధేయ రాముడుగా సంక్రాంత్రికి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇందులో చరణ్ జంటగా కైరా అద్వానీ జతకట్టింది. బాలీవుడ్ నటుడు వివేక్ ఒబెరాయ్ విలన్ పాత్రలో నటించారు. ప్రశాంత్, ఆర్యన్ రాజేష్, స్నేహ కీలక పాత్రల్లో నటించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించారు. డివివి దానయ్య నిర్మించారు.
on set #vvr – We cook while he shoots.
Strict diet+freezing weather = amazing shots 👍🏻😉
Used potato instead of sweet potato cos it was hard to find & Mr.C needed the energy as it was an intense action sequence. Make eating healthy fun 😊#ramcharan #ThrowbackThursday pic.twitter.com/2260GjTAvZ— Upasana Konidela (@upasanakonidela) January 3, 2019