రాజమౌళి మల్టీస్టారర్ టైటిల్ అనౌన్స్

యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌లతో రాజమౌళి మల్టీస్టారర్ #RRR (వర్కింగ్ టైటిల్) తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఫస్ట్ షెడ్యూల్ పూర్తయ్యింది. రాజమౌళి తనయుడు కార్తికేయ పెళ్లి నేపథ్యంలో షూటింగ్ కి బ్రేక్ ఇచ్చారు. సంక్రాంత్రి తర్వాత రెండో షెడ్యూల్ ని ప్రారంభించబోతున్నారు.

ఇదిలావుంటే త్వరలో ఈ సినిమా టైటిల్ ని అనౌన్స్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. రెండో షెడ్యూల్ పూర్తయిన వెంటనే టైటిల్ ప్రకటిస్తారని విశ్వనీయ సమాచారమ్. ఈ సినిమా కోసం ‘రామ రావణ రాజ్యం’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ఫైనల్ గా ఏ టైటిల్’ని ఫిక్స్ చేస్తారన్నది చూడాలి. టైటిల్’తో పాటు హీరోయిన్స్, విలన్, ఇతర కీలక పాత్రల్లో నటీనటుల వివరాలు తెలియాల్సిఉంది.