రఫేల్ డీల్.. రాహుల్ సూటి ప్రశ్న !
కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు రాహుల్ గాంధీ రఫేల్ డీల్ విషయంలో కేంద్రాన్ని నిలదీయడంలో ఏమాత్రం తగ్గడం లేదు. రఫేల్ విషయంలో రాహుల్ రోజుకో కొత్త విషయాన్ని బయటికి తీస్తున్నారు. శుక్రవారం రఫెల్ విషయంపై రక్షణశాఖ మంత్రి నిర్మలాసీతారామన్ వ్యాఖ్యలపై కూడా రాహుల్‌గాంధీ తీవ్రంగా స్పందించారు.
అనిల్ అంబానీకి ఈ కాంట్రాక్ట్ ఎలా వెళ్లింది ? అంబానీకి కాంట్రాక్ట్ ఇవ్వాలని ఎవరు నిర్ణయించారు ? రఫేల్ వివరాలను రహస్యంగా ఉంచాల్సిన అవసరమేంటి ? అని రాహుల్ సూటిగా ప్రశ్నించారు. ఈ కుంభకోణంలో ప్రధాన సూత్రధారి ప్రధాని మోదీ. రఫేల్ ఒప్పందంలో ప్రధాని మోదీ జోక్యం చేసుకుని తన స్నేహితుడైన అనిల్ అంబానీకి కాంట్రాక్ట్ వచ్చే విధంగా చేశారని ఆయన ఆరోపించారు.