రాహుల్ మళ్లీ కన్నుకొట్టాడు
కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ మరోసారి కన్నుకొట్టి కెమెరాకు చిక్కారు. శుక్రవారం లోక్ సభలో రఫేల్పై చర్చ సందర్భంగా తమిళనాడు అన్నాడీఎంకే నేత ఎం.తంబిదురై మాట్లాడుతుండగా రాహుల్ బల్లపై చరిచి అభినందించారు. ఆ తర్వాత వెనక ఉన్న నేతతో ఏదో అంటూ కన్ను కొట్టారు. అది కాస్తా కెమెరా కంటికి చిక్కి మరోసారి వైరల్గా మారింది.
గతేడాది జులైలో ఎన్డీయే ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం పెట్టిన సమయంలో రాహుల్ కన్నుకొట్టడం హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో రాహుల్ ని కన్నుగీటు భామ ప్రియా ప్రకాష్ వారియర్ తో పోల్చారు. వీరిద్దరి ఫోటోలు పక్కన పెడుతూ.. సోషల్ మీడియాలో పెద్ద ప్రచారమే జరిగింది. రాహుల్, ప్రియా వారియర్ లలో ఎవరు బాగా కన్నుగొట్టారనే కామెంట్ కనిపించాయి. ఐతే, రాహుల్ కన్నుకొట్టే అలవాటుని మరోసారి చూపించారు.
Rahul Gandhi ‘winks’ again… This time during the all serious debate on #Rafale. He surely needs help! pic.twitter.com/rncFdTlphU
— Amit Malviya (@amitmalviya) January 4, 2019