సిడ్నీ టెస్టు : ఫాలో ఆన్ ప్రమాదంలో ఆసీస్
సిడ్నీ టెస్టులో ఆస్ట్రేలియా కష్టాల్లో పడింది. 198 పరుగులకే 5 కీలక వికెట్లు చేజార్చుకొంది. 24/0 ఓవర్ నైట్ స్కోరుతో మూడో రోజు బ్యాటింగ్ ప్రారంభించిన ఆసీస్ లంచ్ కు ముందు కేవలం ఒకే ఒక్క వికెట్ ని మాత్రమే కోల్పోయింది. ఐతే, లంచ్ తర్వాత చాలా తక్కువ వ్యవధిలో నాలుగు వికెట్స్ కోల్పోయింది. హారిస్ (79) జడేజా బౌలింగ్‌లో ఔట్ అయ్యాడు. తర్వాత లబుషేన్(38), షాన్ మార్ష్ (8), ట్రావిస్ హెడ్ (20) వికెట్స్ వెంట వెంటనే పడ్డాయి.
ప్రస్తుతం క్రీజులో హ్యాండ్స్ కోంబ్ (21), టిమ్ పైన్(5) ఉన్నారు. భారత స్పిన్నర్లు కుల్ దీప్ యాదవ్, జడేజాలు రెండేసి వికెట్స్ తీయగా, షమీకి ఓ విక్కెట్ దక్కింది. ప్రస్తుతం ఆసీస్ 68 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 198 పరుగులు చేసింది. భారత్ స్కోర్‌ని సమం చేయాలంటే ఆసీస్ మరో 424 పరుగులు చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఆసీస్ కి ఫాలో ఆన్ తప్పేలా లేదు.