చరణ్-కైరా డీప్’గా వెళ్లారుగా.. !
టాలీవుడ్ లోనూ రాణిస్తున్న బాలీవుడ్ ముద్దుగుమ్మ కైరా అద్వానీ. మహేష్ బాబు ‘భరత్ అను నేను’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైంది. ఆ సినిమా షూటింగ్ టైంలో మహేష్ ఫ్యామిలీకి బాగా దగ్గరైంది. మహేష్ సతీమణి నమ్రత, కూతురు సితారలకి మంచి స్నేహితురాలు అయ్యింది. ఇక, ‘వినయ విధేయ రామ’ షూటింగ్ టైంలో రామ్ చరణ్ ఫ్యామిలీకి దగ్గరైంది. చరణ్ తో పాటు ఆయన సతీమణి ఉపాసన కైరాకి మంచి ఫ్రెండ్స్ గా మారారు. అంతేకాదు.. చరణ్ – కైరా మరీ డీప్ గా వెళ్లినట్టు కనబడుతోంది.
‘వినయ విధేయ రామ’ సంక్రాంత్రి కానుకగా ఈ నెల11న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ లో చిత్రబృందం బిజీ అయిపోయింది. ఇందులో భాగంగా చరణ్ – కైరా కలిసి రానా దగ్గుపాటి హోస్ట్ గా వ్యవహరిస్తున్న ‘నెం. యారీ విత్ రానా’ షోకి హాజరయ్యారు. దీనికి సంబంధించిన ఓ పిక్ ని రానా తన ట్విట్టర్ ఖాతాలో పంచుకొన్నారు. ఇందులో చరణ్-కైరా తీక్షణంగా చూసుకొంటూ కనిపించారు. చూస్తుంటే వీరిద్దరు చాలా డీప్ వెళ్లారని అర్థమవుతోంది. అందుకే ఉపాసన కాస్త జాగ్రత్త పడితే మంచిదేమో.. !