కార్తికేయ పెళ్లివిందు ఎక్కడ.. ఎప్పుడంటే ?

దర్శకధీరుడు రాజమౌళి కుమారుడు కార్తికేయ పెళ్లివిందుకు ముహూర్తం ఫిక్సయ్యింది. ఈ ఆదివారం (జనవరి 6) హైద‌రాబాద్‌ రామానాయుడు స్టూడియోలో కార్తికేయ పెళ్లివిందు ఇవ్వనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా సెట్ వేశారు. ఈ విందుకు టాలీవుడ్
సెల‌బ్రిటీస్ అందరిని ఆహ్వానించినట్టు తెలుస్తోంది. రాజకీయ ప్రముఖులని ఆహ్వానించారా ? అన్నది తెలియాల్సి ఉంది.

గతనెల డిసెంబర్ 30న కార్తికేయ-పూజాప్రసాద్ ల వివాహం రాజస్థాన్ రాజధాని జయపురలో ఘనంగా జరిగిన సంగతి తెలిసిందే. పెళ్లి వేడుకని కుటుంబ వేడుకగా నిర్వహించారు రాజమౌళి. టాలీవుడ్ లో అతికొద్దిమందిని మాత్రమే పెళ్లికి పిలిచారు. ప్ర‌భాస్, అనుష్క రామ్ చ‌ర‌ణ్, ఎన్టీఆర్‌, రానా, నాని , నాగార్జున, రాఘ‌వేంద్ర‌రావు.. తదితరులు కార్తికేయ పెళ్లి వేడుకకి హాజరయ్యారు. ఈ సందర్భంగా వీళ్లు చేసిన హడావుడి సోషల్ మీడియాలో వైరల్ గా మారిన సంగతి తెలిసిందే.