ఎన్టీఆర్ సినిమా గెస్ట్’గా తారక రత్న


ఎన్టీఆర్ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. క్రిష్‌ దర్శకత్వం ఎన్టీఆర్ బయోపిక్ రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. తొలిభాగం సంక్రాంత్రి కానుకగా బుధవారం (జనవరి9) ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో అమెరికాలోని న్యూజెర్సీకి చెందిన ఎన్టీఆర్‌ అభిమానులు ఆదివారం ప్రీ రిలీజ్‌ వేడుకను నిర్వహించారు. ఈ వేడుకకు ఎన్టీఆర్‌ మనవడు, సినీ నటుడు తారక రత్న ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అభిమానులు ఆయన్ను సన్మానించి కేక్‌ కట్‌ చేయించారు.

కేక్‌పై ‘యన్‌టిఆర్‌: కథానాయకుడు’ అని రాసున్న పోస్టర్‌ను డిజైన్‌ చేయించి దానిపై ‘ఎన్‌బీకే ఆర్మీ, న్యూజెర్సీ’ అని ప్రింట్‌ చేయించడం ఆకట్టుకుంటోంది. ఒకరోజు ముందే ఈ నెల 8న అమెరికాలోని తెలుగు ప్రేక్షకుల కోసం ఎన్ టీఆర్ కథానాయకుడు ప్రీమియర్‌ షోను వేయనున్నారు. ఫిబ్రవరి 7న రెండోభాగం ‘ఎన్టీఆర్ – మహానాయకుడు’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.