‘వినయ విధేయ రామ’ పబ్లిక్ టాక్
బోయపాటి దర్శకత్వంలో రామ్ చరణ్ నటించిన ‘వినయ విధేయ రామ’ సినిమాపై మెగా అభిమానులు భారీ ఆశలు, ఆంచనాలని పెట్టుకొన్నారు. ధృవ, రంగస్థలం లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ తర్వాత చరణ్ చేసిన సినిమా ఇది. ఈ నేపథ్యంలో ‘వివిఆర్’ చరణ్ ని మరో మెట్టెక్కించేలా ఉండాలని కోరుకొన్నారు. మరీ.. బోయపాటి ఏం చేశారు ? వివిఆర్ ని ఎలా తీర్చిదిద్దారు ? సంక్రాంత్రి కానుకగా ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చిన వివిఆర్ పబ్లిక్ టాక్ ఏంటో చూద్దాం పదండీ.. !
ఇదో కుటుంబ కథ. అన్నదమ్ములలో ఒకరి కి వచ్చిన సమస్య కి హిరో ఎదురు నిలవడం అన్న కాన్సెప్ట్ తో సినిమా తెరకెక్కింది. ఐతే, ఎమోషనల్ సీన్స్ కన్నా.. హై వోల్టేజ్ యాక్షన్ సీన్స్ పైనే బోయపాటి ఎక్కువ దృష్టి సారించారని చెబుతున్నారు. యాక్షన్ సీన్స్ మోతాదుకి మించి ఉన్నాయట. ఇంకా చెప్పాలంటే ఫ్యామిలీ ఆడియెన్స్ ని ఇబ్బంది పెట్టాయని చెబుతున్నారు. ఫస్టాఫ్ బాగుందని, సెకండాఫ్ నిరాశ పరిచిందని సగటు ప్రేక్షకులు చెబుతున్నారు.
‘వివిఆర్’ పబ్లిక్ టాక్ గురించి ఒక్కమాటలో చెప్పాలంట.. రామ్ చరణ్ వన్ మేన్ షో. ఫైట్స్, డ్యాన్సులు, డైలాగ్స్ లో అదరగొట్టేశాడు. సినిమా కోసం ఏం చేయాలో అన్నీ చేశాడు. దర్శకుడు బోయపాటి మాత్రం ఫెయిల్ అయ్యాడు. బలమైన కథ-కథనాలు నడిపించలేకపోయాడు. ఐతే, మాస్ ఆడియెన్స్ పండగ చేసుకొనే సినిమా ఉందని చెబుతున్నారు. మొత్తానికి వివిఆర్ పై మిక్సిడ్ టాక్ వినిపిస్తోంది. బోయపాటి సినిమాలకి ఇది సాధారణమే. మిక్సిడ్ టాక్ వినిపించిన ఆయన సినిమాలు సూపర్ హిట్ గా నిలిచాయి. సరైనోడు సినిమాయే ఇందుకు మంచి ఉదాహరణగా చెప్పవచ్చు