మిక్సిడ్ టాక్.. బ్లాక్ బస్టర్ హిట్.. !

సినిమా టాక్ తో సంబంధం లేకుండా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యే సినిమాలని చాలా అరుదుగా చూస్తుంటాం. గతంలో మిక్సిడ్ టాక్ సొంతం చేసుకొన్న స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ డీజే – దువ్వాడ జగన్నాథమ్, సరైనోడు సినిమాలు మంచి కలెక్షన్స్ సాధించాయి. రామ్ చరణ్ ‘రచ్చ’ కూడా ఇలాంటి ఫలితాన్నే సాధించింది. ఇలా మిక్సిడ్ టాక్ తెచ్చుకొన్న సినిమాలు కమర్షియల్ హిట్టైన సందర్భాలున్నాయి.

ఇవన్నీ ఎందుకు చెబుతున్నాం అంటే.. రామ్ చరణ్ తాజా చిత్రం ‘వివిఆర్’పై మిక్సిడ్ టాక్ వినిపిస్తోంది. ఇది మాస్ ప్రేక్షకులు పండగ చేసుకొనే చిత్రం చెప్పుకొంటున్నారు. మిగితా ఆడియెన్స్ ని పెద్దగా నచ్చకపోవచ్చనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. యాక్షన్ సీన్స్ మోతాదుకి మించి ఉన్నాయి. అవి ఫ్యామిలీ ప్రేక్షకులని ఇబ్బంది పెట్టేలా కనిపిస్తున్నాయని చెబుతున్నారు. పైగా ఫ్యామిలీ ఎమోషన్స్ ప్రేక్షకుడికి కనెక్ట్ అయ్యేలా లేవని తెలుస్తోంది.

రొటీన్ కథతో బోయపాటి వినయ విధేయ రాముడుని తీసుకొచ్చాడు. ఐతే, సినిమా కోసం రామ్ చరణ్ పడిన కష్టం స్పష్టంగా కనిపిస్తోంది. డ్యాన్సులు, ఫైట్స్ లో అదరగొట్టేశాడు. కేవలం రామ్ చరణ్ కోసమే సినిమా చూడొచ్చని చెబుతున్నారు. మరీ.. టాక్ తో సంబంధం లేకుండా చరణ్ కోసం వినయ విధేయ రాముడుని ప్రేక్షకులు బ్లాక్ బస్టర్ హిట్ చేస్తారేమో చూడాలి.