ఏపీలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఘన స్వాగతం !

ఆంధ్రప్రదేష్ లో టీఆర్ఎస్ ఎమ్మెల్యేకి ఘన స్వాగతం లభించడం హాట్ టాపిక్ గా మారింది. ద్వారకాతిరుమలకు వచ్చిన కూకట్‌పల్లి టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావుకు టీడీపీ నేత చెలికాని సోంబాబు స్వాగతం పలికారు. దగ్గరుండి మాధవరం దర్శనం పనులు చూశారు. ఈ విషయం తెలిసిన టీడీపీ శ్రేణులు సోంబాబుపై మండిపడుతున్నారు. ఆంధ్రాకు వచ్చి ఇక్కడ కులరాజకీయాలు చేస్తున్న టీఆర్ఎస్ నాయకులను అడ్డుకుంటామని టీడీపీ నేతలు హెచ్చరిస్తున్నారు. మరోవైపు, ద్వారక తిరుమల వెళ్లిన నేపథ్యంలో మాధవరం కృష్ణారావు ఇవాళ ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేయలేకపోయారు.