రిషభ్ పంత్ ప్రేమలో పడ్డాడు.. !

టీమిండియా యంగ్ వికెట్ కీపర్ రిషబ్‌ పంత్‌ ప్రేమలో పడినట్లు తెలుస్తోంది. ఇటీవల పంత్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ అమ్మాయితో దిగిన ఫొటోను అభిమానులతో పంచుకున్నాడు. ‘నా సంతోషానికి కారణం నువ్వే.. నిన్ను సంతోషంగా ఉంచాలనుకుంటున్నా’ అని కామెంట్‌ పెట్టాడు.

పంత్‌ షేర్‌ చేసిన ఫొటోలోని అమ్మాయి పేరు ఇషా నేగి. ఆమె ఎంటర్‌ప్రెన్యూర్‌, ఇంటీరియర్‌ డిజైనర్‌ కూడా. ఇషా కూడా అదే ఫొటోను షేర్‌ చేయడం విశేషం. ‘మై మ్యాన్‌, మై సోల్‌మేట్‌, బెస్ట్‌ ఫ్రెండ్‌, లవ్‌ ఆఫ్‌ మై లైఫ్‌’ అంటూ ఆమె క్యాప్షన్‌ ఇచ్చింది. దీంతో వీరిద్దరూ గాఢమైన ప్రేమలో ఉన్నారని అభిమానులు అంటున్నారు.

ఇక, ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియా గడ్డపైనే ఓడించి చరిత్ర సృష్టించిన కోహ్లీ సేనలో పంత్‌ కీలక భూమిక పోషించాడు. టెస్టు సిరీస్‌లో పంత్‌ మొత్తం 350 పరుగులు చేసి సిరీస్‌లో అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా నిలిచిన విషయం తెలిసిందే.