చంద్రబాబు దావోస్‌ పర్యటన రద్దు.. వెనక !


ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటన రద్దయింది. చంద్రబాబు స్థానంలో ఆయన తనయుడు, మంత్రి నారా లోకేష్ దావోస్ వెళ్లనున్నారు. సడెన్ గా సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనని రద్దు చేసుకోవడం వెనక పలు కారణాలు కనిపిస్తున్నాయి.

ఎన్నికలు, పార్టీ కార్యక్రమాలపై దృష్టి సారించేందుకు చంద్రబాబు దావోస్ పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. పశ్చిమబెంగాల్ సీఎం మమతా బెనర్జీ నిర్వహించనున్న ర్యాలీలో చంద్రబాబు పాల్గొనాల్సి ఉంది. కోల్ కోల్ కతా వేదికగా ప్రతిపక్ష పార్టీలన్నీ భేటీ కానున్నాయి. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం చంద్రబాబు దావోస్ పర్యటనని రద్దు చేసుకొన్నారు.

ఇదీగాక.. తెలంగాణ సీఎం కేసీఆర్ ముందుగా చెప్పినట్టుగా సంక్రాంత్రి తర్వాత ఫెడరల్ ఫ్రెంటు ఏర్పాటుపై ప్రయత్నాలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగానే బుధవారం కేటీఆర్ నేతృత్వంలోని తెరాస బృందం వైసీపీ అధినేత వైఎస్ జగన్ ని కలిసి ఫెడరల్ ఫ్రెంట్ పై చర్చలు జరిపింది. కేసీఆర్ ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు విషయంలో దూకుడుగా ప్రవర్థిస్తున్న నేపథ్యంలో చంద్రబాబు కూడా కేంద్రంలో తృతీయ ఫ్రంట్ పై వేగం పెంచబోతున్నట్టు తెలుస్తోంది. ఇది కూడా బాబు దావోస్ పర్యటనకి రద్దుకి ఓ కారణమని చెప్పవచ్చు.