‘పహిల్వాన్‌’పై సుల్తాన్ ప్రశంస


కన్నడ స్టార్ సుధీప్‌ తాజా చిత్రం ‘పహిల్వాన్‌’. ఎస్ క్రిష్ణ దర్శకుడు. ఆకాంక్ష సింగ్ హీరోయిన్. సునీల్ షెట్టి, సుశాంత్ సింగ్, కభీర్ దుహాన్.. తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సంక్రాంత్రి కానుకగా విడుదలైన ‘పహిల్వాన్‌’ టీజర్ మంచి స్పందన వస్తోంది. ఈ టీజర్‌కు బాలీవుడ్, కోలీవుడ్‌ల నుంచి ప్రశంసల జల్లు కురుస్తోంది.

తాజాగా, బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ ”పహిల్వాన్‌’ టీజర్ ను ప్రశంసిస్తూ ట్వీట్ చేశారు. సల్మాన్ ట్విట్ పై సుధీప్ ఆనందం వ్యక్తం చేశారు. ‘సార్‌.. ఇది నిజమేనే.. న్నెవరైనా నిద్ర లేపండి. సుల్తాన్ ట్వీట్ చేశారు. థ్యాక్యూ’ అంటూ కామెంట్ చేశారు సుధీప్.