రాజకీయం చేసేందుకు ఎన్టీఆర్ భయపడుతున్నాడా ?
మాట మార్చడం, మడమ తిప్పడం ఎన్టీఆర్ కు అలవాటు లేదు. మొండి పట్టుదలతో ఇటు సినిమాలు, అటు రాజకీయాల్లోనూ రాణించారు. తెలుగు ప్రజల ఆరాధ్యదైవం అయ్యారు. ఇప్పుడు క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ జీవిత కథ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఎన్టీఆర్ పాత్రలో ఆయన తనయుడు బాలకృష్ణ నటిస్తున్నారు. ఆయన భార్య బసవతారకం పాత్రలో బాలీవుడ్ నటి విద్యాబాలన్ నటిస్తున్నారు.
రెండు భాగాలుగా తెరకెక్కుతోన్న ఎన్టీఆర్ బయోపిక్ తొలిభాగం ‘ఎన్టీఆర్-కథానాయకుడు’ సంక్రాంత్రి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. విమర్శకుల ప్రశంసలు అందుకొంది. ఇక, రెండో భాగం ఎన్టీఆర్-మహానయకుడు ఫిబ్రవరి 8న ప్రేక్షకుల ముందుకు రావాల్సి వుంది. ఐతే, మహానాయకుడు వాయిదా పడ్డాడు. ఓ వారం ఆలస్యంగా ఫిబ్రవరి 14 మహానాయకుడు ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నారని తెలిసింది. దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
ఇంతకీ మహానాయకుడు ఎందుకు వాయిదాపడినట్టు ? అంటే షూటింగ్ ఆలస్యమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. ఇన్నాళ్లు చిత్రబృందం కథానాయకుడు ప్రమోషన్స్ తో బీజీ అయ్యింది. ఈ నేపథ్యంలో మిగిలిపోయిన ఓ 10శాతం షూటింగ్ పూర్తికాలేదు. అందుకే ఓ వారం ఆలస్యంగా మహానాయకుడు రాబోతున్నాడు. ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవని తెలుస్తోంది.