రెండో భారతీయుడు తొలి క్లాప్ ప‌డింది

శంకర్ దర్శకత్వంలో కమల్ హాసన్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం ‘ఇండియన్ 2’. తెలుగులో భారతీయుడు2గా రాబోతుంది. 1996లో వచ్చిన ‘భారతీయడు’ సినిమాకు ఇది సీక్వెల్. ఈరోజు చెన్నైలో ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హించారు. అనంత‌రం తొలి షాట్ ను క‌మ‌ల్ హాస‌న్ పై చిత్రీక‌రించారు.

ఈ సందర్భంగా చిత్రబృందం తీసుకొన్న ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఇందులో క‌మ‌ల్ ఓల్డ్ గెట‌ప్ లో కాకీ డ్ర‌స్ వేసుకుని ఉన్నాడు. ఆయన పక్కన హీరోయిన్ కాజల్, ఇతర చిత్రబృందం నిలబడి ఉన్న ఈ ఫోటో ఆకట్టుకుంటోంది. లైకా ప్రొడ‌క్ష‌న్ నిర్మిస్తున్న ఈ మూవీకి అనిరుథ్ సంగీతం స‌మ‌కూరుస్తున్నాడు. స‌ల్మాన్ దుల్క‌ర్, సిద్ధార్ధ్ లు కీల‌క‌పాత్ర‌ల‌లో క‌నిపించ‌నున్నారు.