‘లక్ష్మీస్ ఎన్టీఆర్’లో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ చూశారా ?

రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఎన్టీఆర్ బయోపిక్ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఇది ఎన్టీఆర్ జీవితంలో లక్ష్మీ పార్వతీ ఏపీసోడ్ గా తెరకెక్కుతోంది. ఎన్టీఆర్ కి చంద్రబాబు వెన్నుపోటు ఏపీసోడ్ ని హైలైట్ గా చూపించబోతున్నట్టు సమాచారమ్. దానికి సంబంధించి నిజాలు నిజాల వెనక నిజాలని చూపించబోతున్నట్టు వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే సినిమాకు సంబంధించి షాకింగ్ విషయాలు ఒక్కొక్కటిగా విడుదల చేస్తూ వెళ్తున్నారు. మొదట పాట విడుదలైన ‘వెన్నుపోటు.. ‘ రాజకీయ దుమారం రేపింది.

ఆ తర్వాత సినిమాలో చంద్రబాబు, లక్ష్మీ పార్వతీ పాత్రల్లో నటించిన నటులని పరిచయం చేశారు. శుక్రవారం ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా.. సినిమాలో ఎన్టీఆర్ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశాడు వర్మ. అది కూడా ఎన్టీఆర్ -ఎంతగానో ఇష్టపడే దివ్య ముహూర్తంలో.. సా॥ 6.57నిమిషాలకి విడుదల చేశారు. ఈ ముహూర్తం వెనక స్రీక్రెట్ ని కూడా వర్మ విప్పారు. 6+5+7=18->1+8=9 ఎన్టీఆర్ లక్కీ నెంబర్ అని తెలిపారు.

ఇక, ఎన్ టీఆర్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ లో.. ఎన్టీఆర్ విషాదంగా కూర్చోని సుదీర్ఘంగా ఆలోచిస్తున్నారు. తనలో తానే కుమిలిపోతూ కన్నీళ్లు పెట్టుకొంటున్నాడు. ఎన్ టీఆర్ ఆత్మ ఘోషిస్తోంది అన్నదానికి సరిగ్గా సరిపోయేలా ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ని డిజైన్ చేశాడు వర్మ.