తెలుగు ’96’ ప్రకటన వచ్చేసింది

విజయ్ సేతుపతి-త్రిష జంటగా నటించిన తమిళ చిత్రం ’96’ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి ప్రేమ్ కుమార్ దర్శకత్వం వహించారు. 1996 నాటి ప్రేమకథా నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఈ దశాబ్దకాలంలో వచ్చిన బెస్ట్ లవ్ స్టోరీ అనిపించుకొంది. ఈ సినిమా తెలుగు రైట్స్ ని దిల్ రాజు తీసుకొన్నారు. శర్వానంద్ – సమంత జంటగా తెలుగు ’96’ రిమేక్ రాబోతుందని ప్రచారం జరిగింది. ఇప్పుడది నిజమైంది. గణతంత్య్ర దినోత్సవం కానుకగా 96 తెలుగు రిమేక్ అధికారిక ప్రకటన వచ్చేసింది.

ఈ మేరకు ఓ పోస్టర్ ని విడుదల చేసింది చిత్రబృందం. శర్వానంద్ – సమంత ఫోటోలతో పోస్టర్ ని డిజైన్ చేశారు. ఈ చిత్రానికి కథ-దర్శకత్వం ప్రేమ కుమార్. దిల్ రాజు నిర్మించనున్నారని పేర్కొన్నారు. త్వరలోనే ఈ సినిమాని సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నారు. ప్రస్తుతం సమంత ‘మజిలీ’ సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తవ్వగానే 96 కోసం శర్వానంద్ తో జతకట్టనుంది.