కంగనా సోదరి ఎటాక్


బాలీవుడ్ క్వీన్ కంగనా ఎటాక్ చేస్తే ఎలాగుంటుందనేది తెలిసిందే. ఎంతకైనా తెగిస్తుంది. కంగానా-హృతిక్ ఎపీసోడ్ లో కంగనా తెగింపుని చూశాం. ఇప్పుడు దర్శకుడు క్రిష్ విషయంలోనూ స్వయంగా కంగనా రంగంలోకి దిగుతుందని భావించారు. ఐతే, అందుకు భిన్నంగా కంగనా సోదరి రంగోలి రంగంలోకి దిగారు. క్రిష్-కంగనా ఏపీసోడ్ పై రంగోలి ట్విటర్‌ ద్వారా స్పందించారు.

‘క్రిష్‌.. ‘మణికర్ణిక’ సినిమా మొత్తం మీరే దర్శకత్వం వహించారని ఒప్పుకొంటాను. ప్లీజ్‌ ఈ విషయం ఇంతటితో వదిలెయ్యండి. దర్శకత్వం వహించింది మీరే అయినా సినిమాలో తనదే ప్రధాన పాత్ర. ఈ విజయాన్ని కంగనను ఎంజాయ్‌ చెయ్యనివ్వండి. ఆమెను ఒంటరిగా వదిలెయ్యండి. మీరు చెప్పినవన్నీ నిజాలేనని నమ్ముతున్నాం’ అని వెల్లడిస్తూ చేతులెత్తి నమస్కరిస్తున్న ఇమోజీని పోస్ట్‌ చేశారు రంగోలి.

తాను దర్శకత్వం వహిస్తే.. ‘మణికర్ణిక’ సినిమా క్రెడిట్‌ మొత్తం కంగనే తీసుకుందని దర్శకుడు క్రిష్‌ ఆరోపించిన సంగతి తెలిసిందే. తాను తెరకెక్కించిన సన్నివేశాలనే మరోసారి కంగన తెరకెక్కించి దర్శకురాలినని చెప్పుకొంటున్నారని క్రిష్‌ బాధపడ్డారు.