ఫిబ్రవరి1న ఏపీ బంద్.. !


ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమం మరోసారి ఊపందుకొంది. ప్రత్యేహ హోదాపై రెండు అఖిల పక్ష సమావేశాలు జరగనున్నాయి. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో రేపు అమరావతిలో అఖిలపక్ష సమావేశం జరగనున్న సంగతి తెలిసిందే. ఈ సమావేశానికి అధికారిక పార్టీ టీడీపీ కూడా హాజరుకావాలని నిర్ణయం తీసుకొంది. ఇక, ఎల్లుండి (జనవరి 30) ఏపీ ప్రభుత్వం అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించనుంది. ఇందులో ప్రత్యేక హోదా, ఇప్పటి వరకు ఏపీకి కేంద్రం చేసిన సాయంపై చర్చించనున్నారు.

మరోవైపు, ప్రత్యేక హోదా సాధన సమితి ఫిబ్రవరి 1న ఏపీ బంద్ కు పిలుపునిచ్చింది. ఇప్పటికే ఈ బంద్ కు ప్రతిపక్ష పార్టీలన్నీ మద్దతు ప్రకటించారు. అధికార టీడీపీ కూడా బంద్ కు మద్దతు ఇవ్వనుంది. ఈ నేపథ్యంలో ఫిబ్రవరి 1న ఏపీ బంద్ సంపూర్ణంగా జరగబోతున్నట్టు తెలుస్తోంది. ఇదీగాక, పార్లమెంట్ సమావేశాల సందర్భంగా దీక్ష చేసేందుకు ఏపీ సీఎం చంద్రబాబు రెడీ అవుతున్నారు. మొత్తంగా.. ఏపీ ప్రత్యేక హోదా ఉద్యమం మరోసారి ఉదృతంగా మారేలా కనబడుతోంది.