జార్జి ఫెర్నాండెజ్ కన్నుమూత
మాజీ రక్షణ శాఖ మంత్రి జార్జి ఫెర్నాండెజ్ (88) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఫెర్నాండె స్పైన్ ప్లూతో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రజా పోరాఠాలకు యోధుడుగా ఫెర్నాండెజ్ నిలిచారు. వాజుపేయి హయాంలో రక్షణశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు. పరిశ్రమలు, రైల్వే, రక్షణ శాఖ మంత్రిగా పనిచేశారు.
1930 జూన్ 30న మంగళూరులో ఫెర్నాండెజ్ జన్మించారు. 1967 నుంచి 2004 వరకు 9 సార్లు ఎంపీగా ఎన్నికయ్యారు. వాయిపేయి హయంలో కీలక నేతగా పనిచేశారు. ఫెర్నాండెజ్ సమత పార్టీని స్థాపించారు. ఫెర్నాండెజ్ మృతి పట్ల ప్రధాని నరేంద్రమోడీతో పాటు పలువురు రాజకీయ ప్రముఖులు సంతాపం తెలియజేశారు. ఫెర్నాండెజ్ అంత్యక్రియలు క్రిస్టియన్ సంప్రదాయంతో జరగనున్నాయి.