మురగదాస్’కు ఓకే చెప్పిన బన్నీ

స్టయిలీష్ స్టార్ అల్లు అర్జున్ స్టార్ దర్శకులని లైన్ లో పెడుతున్నట్టు కనబడుతోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ సినిమా త్వరలోనే ప్రారంభం కానుంది. మార్చి నుంచి సినిమా రెగ్యూలర్ షూటింగ్ కి వెళ్లనున్నట్టు తెలుస్తోంది. ఐతే, ఈ సినిమా తర్వాత మురగదాస్ దర్శకత్వంలో బన్నీ సినిమా ఉండబోతున్నట్టు సమాచారమ్.

వాస్తవానికి ‘నా పేరు సూర్య’ తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో బన్నీ సినిమా తెరకెక్కాల్సి ఉంది. దాదాపు ఏడాదికాలం పాటు బన్నీ కోసం కథని రెడీ చేసే పనిలో విక్రమ్ ఉన్నారు. ఆఖరికి ఆయనకి నో చెప్పేసి.. త్రివిక్రమ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు బన్నీ. దీంతో.. విక్రమ్ కుమార్ నాని తో ఓ సినిమా చేసేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నాడు.

నాని సినిమా అయ్యాక బన్నీ విక్రమ్ సినిమా వుంటుందని టాక్. లేటెస్ట్ న్యూస్ ఏంటంటే.. ? విక్రమ్ కుమార్ తో బన్నీ సినిమా ఉండకపోవచ్చు. ఆయన స్థానంలో మురుగదాస్ సినిమా తెరకెక్కనుందని తెలుస్తోంది. కోలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చేందుకు బన్నీ ఎప్పటి నుంచో ట్రై చేస్తున్నారు. లింగుస్వామి దర్శకత్వంలో సినిమా ప్రకటన కూడా చేశారు. ఆ తర్వాత ఆ సినిమా అప్ డేట్ రాలేదు. ఈ నేపథ్యంలో మురగదాస్ దర్శకత్వంలో బన్నీ కోలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తోంది.