రకుల్ సెల్ఫ్ ప్రమోషన్
స్టార్ హీరోయిన్స్ తీరే వేరు. వాళ్లు వెరీ బిజీ. అసలు సినిమా ప్రమోషన్స్ లో పాల్గొన్నారు. ఆడియో వేడుక, ప్రీ-రిలీజ్ ఫంక్షన్, సినిమా ప్రెస్ మీట్.. ఇలాంటివి వారికి రుచించవు. వచ్చామా.. షూటింగ్ పూర్తి చేశామా.. వెళ్లామా అన్నట్టు వ్యవహరిస్తారు. ఇందుకు నయనతారయే మంచి ఉదాహరణ. ఐతే, రకుల్ ప్రీత్ సింగ్ ఇందు భిన్నం. ఆమె సినిమా ప్రమోషన్స్ కు సహకరిస్తుంటుంది. చిత్రబృందం కంటే ముందే సినిమాని ప్రమోట్ చేసే పనిలో ఉంటుంది. ఇందుకుగానూ సోషల్ మీడియా వేదిక ఎంచుకుంటోంది.
కార్తీ-రకుల్ ప్రీత్ సింగ్ జంటగా నటించిన చిత్రం ‘దేవ్’. రజత్ రవిశంకర్ దర్శకుడు. దేవ్ ప్రేమికుల రోజు కానుకగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ నేపథ్యంలో రకుల్ తనదైన స్టయిల్ లో సినిమాని ప్రమోట్ చేస్తోంది. తాజాగా, సినిమాలో తనపై ఓ క్యూట్ వీడియోని కట్ చేసి తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేసింది.
#DevFromFeb14 ❤️❤️ pic.twitter.com/k4FuhFyTZU
— Rakul Preet (@Rakulpreet) February 4, 2019
#DevFromFeb14 ❤️❤️ pic.twitter.com/k4FuhFyTZU
— Rakul Preet (@Rakulpreet) February 4, 2019