హీరోయిన్స్ డ్రెస్సింగ్ : బాలుకు నాగబాబు కౌంటర్
ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం ఇటీవల హీరోయిన్ల వస్త్రధారణ షాకింగ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
‘హీరోయిన్లు పొట్టి దుస్తులు ధరించి అంగాంగ ప్రదర్శన చేయడాన్ని ఏమని భావించాలి. అది హీరోయన్ల అమాయకత్వమనుకోవాలా ? లేదంటే అలాంటి దుస్తులు ధరిస్తే తప్ప సినిమాల్లో అవకాశాలు రావని భావిస్తున్నారని అనుకోవాలా ? చాలామంది హీరోయిన్లకు తెలుగు రాదు. కాబట్టి తానేమన్నాననే విషయం వారికి అర్థం కాకపోవచు. ఒకవేళ అర్థమై ఏమైనా, స్పందించినా.. తాను భయపడేది లేదు’ కామెంట్ చేశారు బాలు. బాలు కామెంట్స్ పై హీరోయిన్స్ నుంచి ఎలాంటి రియాక్షన్ రాలేదు.
తాజాగా, బాలుకు మెగా బ్రదర్ నాగబాబు కౌంటర్ ఇచ్చారు. నాగబాబు ఇటీవల సొంతంగా యూట్యూబ్ ఛానెల్ పెట్టి పొలిటికల్ సెటైర్లు వేస్తోన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు బాలుపై విరుచుకు పడ్డాడు. ఆయన పేరు ప్రస్తావించకుండా పరోక్షంగా కౌంటర్లు వేశారు. ‘ఈ మధ్యన కొందరు మహానుభావులు, వాళ్ల పేర్లు చెప్పడం నాకు ఇష్టం లేదు.. ఆడవాళ్ల డ్రెస్సింగ్ మీద మాట్లాడాడు.. అలానే ఓ నటుడు పార్లమెంట్ లో మాట్లాడారు. ఆడవాళ్లు ఎక్స్ పోజ్ చేసే దుస్తులు వేసుకోకూడదని అన్నారు. అసలు ఆడపిల్లలు ఎలాంటి బట్టలు వేసుకోవాలో చెప్పడానికి మీరెవరు..? మీకు ఎవరు అధికారం ఇచ్చారని’ ప్రశ్నించారు.
‘మగవాడి కామ దృష్టికి, నీచమైన ఆలోచనకి అమ్మాయిలు ఎలాంటి బట్టలు వేసుకున్నా వాడి బుద్ధి మారదు. సినిమా హీరోయిన్లు ఎలాంటి బట్టలు వేసుకోవాలనుకుంటున్నారో అది వాళ్ల ఇష్టమని మధ్యలో చెప్పడానికి మీరెవరిని ఫైర్ అయ్యాడు. మగవాడి బట్టల విషయంలో ఆడపిల్లలు ఎప్పుడూ కండీషన్స్ పెట్టలేదని, పాత సంప్రదాయాలని పట్టుకొని గబ్బిలాలు మాదిరి వేలాడుతున్న వారు ఇకనైనా మారండని సూచించారు.
‘అమ్మాయిలు ఎక్స్ పోజ్ చేస్తుంటే మీరు చూడకుండా ఉండలేరా..? ముందు మీ వక్రబుద్ధి మార్చుకోండని’ అన్నారు. ‘మీరు చూసేదంతా చూసేసి చప్పలించేస్తారు.. ఆ తరువాత స్టేజ్ మీదకొచ్చి కబుర్లు చెప్తారు.. ఆపండి సార్’ అంటూ బాలసుబ్రహ్మణ్యంని ఉద్దేశిస్తూ సెటైర్లు వేశారు. దీనిపై బాలు ఏమైనా వివరణ ఇస్తారేమో చూడాలి.