బ్రేకింగ్ : నటి ఝాన్సీ ఆత్మహత్య

బుల్లితెర నటి ఝాన్సీ ఆత్మహత్య చేసుకొన్నారు. ఇంట్లో ఫ్యాన్ కు ఉరేసుకొని ఆమె ఆత్మహత్యకు పాల్పడ్డారు. ప్రేమ వ్యవహారమే ఝాన్సీ ఆత్మహత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా గుర్తించినట్టు తెలుస్తోంది. గతకొంతకాలంగా ఝాన్సీ ఓ వ్యక్తితో ప్రేమలో ఉన్నట్టు చెబుతున్నారు. ఈ విషయంలో కుటుంబ సభ్యులతో ఝాన్సీ గొడవపడినట్టు తెలిసింది.

ప్రస్తుతం ఝాన్సీ ‘పవిత్రబంధం’ సీరియల్ లో నటిస్తున్నారు. మరోవైపు, అమీర్ పేటలో ఓ బ్యూటీ ప్యార్లల్ నిర్వహిస్తున్నారు. ప్రేమ వ్యవహారం, కుటుంబ సభ్యులతో గొడవతో ఝాన్సీ మానసిక వేదనకి గురైంది. దీంతో శ్రీనగర్ లోని ఇంట్లో ఫ్యాన్ కి గురేసుకొని ఆత్మహత్యకి పాల్పడినట్టు తెలుస్తోంది. ఝాన్సీ హత్యపై ఆమె కుటుంబ సభ్యులు, ఆమె ప్రేమించిన వ్యక్తి స్పందిస్తే.. పూర్తి వివరాలు తెలియనున్నాయి.