స్పీకర్ పోచారంకి మాతృవియోగం
తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి మాతృవియోగం కలిగింది. పోచారం తల్లి పరిగే పాపవ్వ (107) కన్నుమూశారు.
వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న పాపవ్వ బాన్సువాడ ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి తుదిశ్వాస విడిచారు. ఈరోజు పాపవ్వ అంత్యక్రియలు స్వగ్రామం పోచారంలో జరుగనున్నాయి. స్పీకర్ పోచారం తల్లి మృతి పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలు సంతాపం తెలిపారు. గత నాలుగున్నరేళ్ల టీఆర్ఎస్ పాలనలో పోచారం వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేశారు. ఐతే, ఈసారి ఆయన స్వీకర్ గా ఎన్నికయ్యారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో అత్యంత సాన్నిహిత్యం ఉన్న సీనియర్ నేతల్లో పోచారం ఒకరు. ఆయన్ని ముఖ్యమంత్రి లక్ష్మీపుత్రుడుగా పిలుస్తుంటారు.