బిగ్ బాస్-3కి ఎన్టీఆర్ గ్రీన్ సిగ్నల్.. కానీ !

తెలుగు బిగ్ బాస్ సీజన్ – 3 కోసం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హోస్ట్ గా వ్యవహరించబోతున్నట్టు ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తారక్ ని బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదించిన మాట నిజమే. ఫస్ట్ రౌండ్ డిస్కషన్లలో ఎన్టీఆర్ ప్రాధమికంగా ఓకే అన్నట్లుగా కూడా తెలుస్తోంది. ఐతే, లెటెస్ట్ న్యూస్ ఎంటంటే.. ? ఆర్ఆర్ఆర్ సినిమా బిగ్ బాస్ కు అడ్డంపడుతోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు దాదాపు 200 వర్కింగ్ డేస్ కాల్ షీట్లు ఇచ్చాడట. ఇప్పటికి గట్టిగా పాతిక కూడా కాలేదు.

ఇంకా 175 కాల్ షీట్లు కావాలి. ఈ నేపథ్యంలో బిగ్ బాస్ షో చేయడం కన్నా, వదిలేయడానికే ఎన్టీఆర్ మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ యాజమాన్యం మాత్రం ఎలాగైనా అడ్జస్ట్ చేయమని తారక్ తో డిస్కషన్లు సాగిస్తున్నట్లు తెలుస్తోంది. ఫైనల్ గా బిగ్ బాస్ విషయంలో తారక్ ఏ నిర్ణయం తీసుకొంటాడన్నది ఆసక్తిగా మారింది. ఒకవేళ బిగ్ బాస్ 3కి ఎన్టీఆర్ ఓకే చెబితే మాత్రం.. ఈసారి షో ఓ రేంజ్ లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. అన్నట్టు.. తారక్ ఓకే అంటే ఆయనకి రూ. 20కోట్ల పారితోషికం ఇచ్చేందుకు బిగ్ బాస్ నిర్వహకులు రెడీగా ఉన్నట్టు సమాచారమ్.