బ్రహ్మీతో కలిసి బన్నీ నవ్వులు


ప్రముఖ హాస్య నటుడు బ్రహ్మానందం ఇటీవలే గుండెకు సంబంధించిన ఆపరేషన్ చేయించుకొన్న సంగతి తెలిసిందే. ముంబైలోని ఏషియన్ హార్ట్ ఇన్స్టిట్యూట్ లో బ్రహ్మానందంకు ఆపరేషన్ జరిగింది. ప్రస్తుతం బ్రహ్మీ హైదారాబాద్ లోని తన ఇంట్లో విశ్రాంత్రి తీసుకొంటున్నారు. దీంతో పలువురు సినీ ప్రముఖులు బ్రహ్మీ ఇంటికెళ్లి ఆయన పరామర్శిస్తున్నారు.

తాజాగా, హీరో అల్లు అర్జున్ బహ్మీ ఇంటికెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా బహ్మీతో కలిసి దిగిన ఫోటోని తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశాడు స్టయిలీష్ స్టార్. ‘కిల్‌బుల్ పాండే’ తన జబ్బుని కిల్ చేశారంటూ కామెంట్ పెట్టారు. బహ్మీ-బన్నీ కలిసి నవ్వులు చిందుస్తున్న ఫోటో, బన్నీ పెట్టిన కామెంట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

ఇక, సినిమాల విషయానికొస్తే.. త్రివిక్రమ్ దర్శకత్వంలో బన్నీ సినిమా తెరకెక్కనుంది. హీరోయిన్ గా రష్మిక మందన పేరు వినిపిస్తోంది. థమన్ సంగీతాన్ని అందించబోతున్నాడని తెలిసింది. ఈ చిత్రానికి హారిక & హాసినీ క్రియేషన్స్, గీతా ఆర్ట్స్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించనున్నాయి. త్వరలోనే సినిమా సెట్స్ మీదకు వెళ్లనుంది.