‘ఆర్ఎక్స్100’ హీరో పెద్ద విలన్


హీరోలోనూ విలన్ లక్షణాలు ఉండటం చాలా అరుదు. అలా చాలా తక్కువ హీరోలు విలన్ గా మెప్పించిన వారు ఉన్నారు. ఇప్పుడీ లిస్టులో ‘ఆర్ఎక్స్100’ హీరో చేరబోతున్నట్టు సమాచారమ్. తొలి సినిమాతోనే క్రేజీ స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకొన్నాడు కార్తికేయ. ఆయన రెండో సినిమా ‘హిప్పీ’ అర్జున్ జంధ్యాల దర్శకత్వంలో తెరకెక్కుతోంది. ఇప్పుడీ యంగ్ హీరో విలన్ పాత్రలో నటించేందుకు ఓకే చెప్పి.. అందిరికీ షాక్ ఇచ్చాడు. విక్రమ్ కె దర్శకత్వంలో నాని సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.

ఇందులో నాని ప్లే బోయ్ రోల్ లో కనిపించనున్నాడు. ఏకంగా ఐదురుగురు హీరోయిన్స్ తో రొమాన్స్ చేయబోతున్నాడని సమాచారమ్. అంతేకాదు.. భారీ బడ్జెట్ తో సినిమాని ప్లాన్ చేస్తున్నారంట. ఇందులో నానికి విలన్ గా ఆర్ఎక్స్100 హీరో కార్తికేయ కనిపించబోతున్నాడట. ఇటీవలే దర్శకుడు విక్రమ్ కుమార్ కార్తీకేయని కలిసి నాని సినిమాలో విలన్ రోల్ చేయమని అడిగారట. విలన్ పాత్రైనా నటనకి మంచి స్కోప్ ఉన్న పాత్ర కావడంతో.. కార్తీకేయ కూడా ఓకే చెప్పినట్టు తెలుస్తోంది.

ఈ యంగ్ హీరో స్టార్ హీరో కావడమేంటో గానీ.. పెద్ద విలన్ అనిపించుకొనేలా కనిపిస్తున్నాడు. అసలే టాలీవుడ్ లో విలన్స్ కి మంచి గిరాకీ. దీనికితోడు విలన్ కి కావాల్సిన ఫిజిక్కు ఉన్న కార్తికేయ ఆ పాత్రలకి సరిగ్గా సరిపోయేలా ఉన్నాడు. నాని సినిమాలో కార్తికేయ విలన్ గా అదరగొడితే.. ఆయనకి వరుసగా నెగిటివ్ షేడ్స్ పాత్రలో రావొచ్చు. అది జరిగితే స్టార్ హీరో కాబోయి స్టార్ విలన్ కావొచ్చు కార్తికేయ.