రకుల్ ఆ స్థాయికి పడిపోయింది.. !

ఈ మధ్య సీనియర్ హీరోయిన్స్ సైతం రూటు మార్చారు. సీనియర్ హీరోలతో జతకట్టేందుకు అస్సలు ఇష్టపడటం లేదు. వాళ్లు కూడా కుర్రాళ్లని కోరుకొంటున్నారు. కాజల్, నయన్, తమన్నా.. వరుసగా యంగ్ హీరోలతో జతకడుతున్న సంగతి తెలిసిందే. ఇందుకోసం పారితోషికాన్ని సైతం తగ్గించుకొనేందుకు సై అంటున్నారు. ఈ నేపథ్యంలో సీనియర్ స్టార్ చిరంజీవి, బాలకృష్ణ, నాగ్, వెంకీలకి హీరోయిన్స్ దొరకడం లేదు. వీరిలో బాలయ్యకు హీరోయిన్ సమస్య మరీ.. ఎక్కువగా ఉంది.

ఆయనకి హీరోయిన్ ని సెట్ చేయడం దర్శక-నిర్మాతలకి పెద్ద తలనొప్పిగా మారింది. ఇలాంటిది బాలయ్యతో రొమాన్స్ చేసేందుకు యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ ముందుకొచ్చింది. బోయపాటి దర్శకత్వంలో బాలయ్య సినిమా తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ప్రీ-ప్రొడక్షన్స్ జరుపుకొంటున్న ఈ సినిమాని త్వరలోనే సెట్ మీదకు తీసుకెళ్లనున్నారు. ఈ సినిమా కోసం బోయపాటి రకుల్’ని సంప్రదించడం.. ఆమె ఓకే చెప్పడం జరిగిపోయినట్టు టాక్. షూటింగ్ ఎప్పుడో చెప్పండీ వచ్చేస్తా అందట.